Tamannah : రెడ్ స్ట్రాప్ లెస్ గౌన్లో .. మిల్కీ బ్యూటీ

Tamannah : రెడ్ స్ట్రాప్ లెస్ గౌన్లో ..   మిల్కీ బ్యూటీ

20 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah). అయినప్పటికీ అందం విషయంలో ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గదెలే అనిపిస్తోంది. ఆకట్టుకునే అందంతో ఇంకా సినిమాల్లో రాణిస్తోంది. శ్రీ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తమన్నా.. అనంతరం పలు సినిమాల్లో నటించి ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అందం, నటనతో తనదైన శైలిలో రాణిస్తూ.. అటు బాలీవుడ్ లోనూ ఇటు సౌత్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. షూటింగ్ ల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులను వారితో పంచుకుంటోంది. ఆకట్టుకునే అందంతో ఫొటో షూట్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా రెడ్ స్ట్రాప్ లెస్ గౌన్ లో కిర్రాక్ గా ఫొటోషూట్ చేసింది ఈ అమ్మడు.

ఈ ఫొటోల్లో స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం తమన్నా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్నా ఫిట్ నెస్, గ్లామర్ ను పొగుడుతూ ఫాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ అందం ఏ మాత్రం తగ్గలేదని కితాబిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అరణ్మనై4, వేదా వంటి చిత్రాల్లో ఆమె నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story