Tanisha Mukherjee : ఎత్తైన కొండపై నుంచి జారిపడ్డ : తానీషా ముఖర్జీ
![Tanisha Mukherjee : ఎత్తైన కొండపై నుంచి జారిపడ్డ : తానీషా ముఖర్జీ Tanisha Mukherjee : ఎత్తైన కొండపై నుంచి జారిపడ్డ : తానీషా ముఖర్జీ](https://www.tv5news.in/h-upload/2024/04/20/1242349-taniya-mukherjee.webp)
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కంత్రి సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి తానీషా ముఖర్జీ. టాలీవుడ్ లో ఈ ఒక్క సినిమాలోనే తానీషా నటించిన.. తమిళ్, హిందీలో మాత్రం చాలా సినిమాలే చేసింది. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గానే ఉంది. హిందీ బిగ్ బాస్ సీజన్ -7లోనూ పాల్గొంది. అయితే తానీషా మొదటి సినిమా సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి తాజాగా చెప్పుకొచ్చింది. సినిమాలపై ఉన్న ప్రేమతో తన తలకు పెద్ద గాయమైన విషయాన్ని దాచిపెట్టింది. మొదటి సినిమా 'ష్' షూటింగ్ సమయంలో ఓ ఎత్తైన కొండపై నుంచి జారి కింద పడినట్టు తెలిపింది. దీంతో తలకు బలమైన గాయమైందని.. దానికి ఏడాది పాటు చికిత్స తీసుకున్నానని పేర్కొంది. ఈ విషయం చెబితే ఎక్కడ సినిమాలోంచి తొలగిస్తారో అన్న భయంతో దాచిపెట్టినట్లు వెల్లడించింది. ప్రమాదం తర్వాత మునుపటి లా యాక్టింగ్ చేయలేక పోయానని వాపోయింది. బరువు కూడా పెరిగినట్లు తెలిపింది. సినిమాలో కొన్ని చోట్ల ఎక్స్ ప్రెషన్స్ వేగంగా పలికించలేకపోయానని.. అందుకే తనకు యాక్టింగ్ రాదనే విమర్శలు ఎదుర్కొన్నట్లు బాధపడింది. ప్రస్తుతం 'లవ్ యూ శంకర్' సినిమాలో తానీషా నటిస్తోంది. అలాగే హిందీలో కొన్ని టీవీ షోలకు అమ్మడు హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com