Teja Sajja : తేజా సజ్జతో పూరీ జగన్నాథ్ సినిమా?

Teja Sajja : తేజా సజ్జతో పూరీ జగన్నాథ్ సినిమా?
X

‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న తేజా సజ్జతో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ సినిమా చేయనున్నారట. ఇందుకు సంబంధించి కథాచర్చలు జరుగుతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం హీరో రామ్‌తో ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ సినిమా ఓటిటి రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలిసిందే.. ఇక విడుదల తేదీని కూడా త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా తర్వాత తేజా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

తేజ ఇప్పుడిప్పుడే సక్సెస్ కొట్టడం, దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రయోగాలంటూ చేయడం అనేది అసాధ్యం. పైగా పూరి ఇప్పుడున్న ఫాం కూడా అందరికీ తెలిసిందే. అలాంటిది పూరి జగన్నాథ్‌తో సినిమా అనే ప్రయోగాన్ని తేజ సజ్జా చేయగలడా? అన్నది చూడాలి.

Tags

Next Story