Sreekaram : యాంకర్ ని పెళ్లి చేసుకున్న శ్రీకారం డైరెక్టర్

Sreekaram : యాంకర్ ని పెళ్లి చేసుకున్న శ్రీకారం డైరెక్టర్

తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యతో 'శ్రీకారం' సినిమా దర్శకుడు కిశోర్‌ రెడ్డి వివాహం జరిగింది. నేడు మార్చి 1న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో యాంకర్ కృష్ణ చైతన్యను కిశోర్‌ రెడ్డి వివాహం చేసుకున్నారు. కిశోర్‌- కృష్ణ చైతన్యల వివాహానికి సినీ పరిశ్రమ నుంచే కాకుండా మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

శర్వానంద్ హీరోగా శ్రీకారం అనే సినిమా డైరెక్ట్ చేశారు కిషోర్ రెడ్డి. శర్వానంద్ హీరోగా రైతుల సమస్యలు ప్రధాన ఇతివృత్తంగా శ్రీకారం అనే సినిమా తెరకెక్కించారు. తెలుగులో ‘లవ్‌.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి’ వంటి చిత్రాలతో పాటు కన్నడంలో ఓ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.

యాంకర్‌ కేసీగా కృష్ణ చైతన్య అందరికీ సుపరిచితమైనదే. గతంలో రేడియో జాకీగా పనిచేశారు. ఆర్జే స్మైలీ క్వీన్‌ పేరుతో ఆమె రేడియో జాకీగా వ్యవహరించేవారు. పలు యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో పాటు సినిమా ఈవెంట్‌లకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story