Telugu Actress : పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకున్న వాసంతి కృష్ణన్

టాలీవుడ్ నటి, తెలుగు బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ (Vasanti Krishnan) పెళ్లి చేసుకుంది. తన ప్రేమికుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో కలిసి ఇవాళ తిరుపతిలో ఏడడుగులు వేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం అర్థరాత్రి ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు వాసంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తిరుపతికి (Tirupati) చెందిన వాసంతి కృష్ణన్ 'సిరిసిరి మువ్వలు' సీరియల్‌తో ఇండస్ట్రీలోకి వచ్చింది. గోరింటాక్, గుప్పెడంత మనసు సీరియల్స్‌లో నటించింది. లీఫ్లవర్, భువన విజయం, మనే నం.67, సీఎస్ఐ సనాతన్ లాంటి పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు. తెలుగుతో పాటు కన్నడలోనూ వాసంతి పలు సినిమాలు చేశారు.
గతేడాది పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడిన వాసంతి కృష్ణన్ ఇక ఇప్పుడు వివాహబంధంతో ఒక్కటయ్యారు. పవన్ కూడా నటుడే. హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. వీరి పెళ్లి వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com