The 100 : ‘ది 100’.. 'మొగలిరేకులు' ఫేమ్ మోషన్ పోస్టర్

'మొగలిరేకులు' (Mogalirekulu) సీరియల్ తో ఫేమ్ సంపాదించుకున్న ఆర్కే సాగర్ (RK Sagar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది 100’ (The 100). ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తుండగా.. ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మూవీ నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ విషయానికొస్తే.. సాగర్ విక్రాంత అనే ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై దర్శకుడు రాఘవ్ ఓంకార్ మాట్లాడుతూ.. ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతోందని తెలిపాడు. విక్రాంత్ అనే ఐపీఎస్ పాత్రలో ఆర్కే సాగర్ ఇంప్రెస్ చేయనున్నాడు. ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అలాగే కమర్సియల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.
ఈ సినిమాకు శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. గిరిధర్, ఆనంద్ (దొంగ దొంగ ఫేమ్), లక్ష్మీ గోపాల్ స్వామి (అరవింద సమేత ఫేమ్), కళ్యాణి నటరాజన్, బాలకృష్ణ, జయంత్, విష్ణు ప్రియ (యాంకర్) తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com