'ఉడాన్' నటి.. క్యాన్సర్‌తో మృతి

ఉడాన్ నటి.. క్యాన్సర్‌తో మృతి
1989 ఉడాన్ షోలో ఐపీఎస్ అధికారిణి కళ్యాణి సింగ్ పాత్రను పోషించిన కవితా చౌదరి కన్నుమూశారు. ఆమె తన 67వ ఏట అమృత్‌సర్‌లో తుది శ్వాస విడిచింది.

1989 ఉడాన్ షోలో ఐపీఎస్ అధికారిణి కళ్యాణి సింగ్ పాత్రను పోషించిన కవితా చౌదరి కన్నుమూశారు. ఆమె తన 67వ ఏట అమృత్‌సర్‌లో తుది శ్వాస విడిచింది.

టెలివిజన్ నటి కవితా చౌదరి 1989-1991 మధ్య ప్రసారమైన హిట్ టీవీ షో ఉడాన్‌లో IPS ఆఫీసర్‌గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత ఫిబ్రవరి 15, 2023, గురువారం అమృత్‌సర్‌లో ఆమె తుది శ్వాస విడిచింది.

ఐదు రోజుల క్రితం ఆమె పరిస్థితి విషమించడంతో అమృత్‌సర్‌లోని పార్వతి దేవి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆమెను 5 రోజులు వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమెను రక్షించడానికి వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది.

కవితా చౌదరి మేనల్లుడు అజయ్ సయల్ మాట్లాడుతూ.. ఆమె నాకు సర్వస్వం - ఆమె నా స్నేహితురాలు, తండ్రి, తల్లి , సోదరుడు, సోదరి, గురువు. నేను ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాను. కానీ ఆమెను బ్రతికించుకోలేకపోయాను.

"ఆమెకు అకస్మాత్తుగా బీపీ పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చాము. కానీ వైద్యులు ఆమెను రక్షించలేకపోయారు. అంతకుముందు అండాశయ క్యాన్సర్ తో బాధపడింది. దానికి ఆపరేషన్ చేయించాము.

కవితా చౌదరి ఉడాన్‌లో ఐపీఎస్ అధికారిణి కళ్యాణి సింగ్ పాత్రతో ప్రసిద్ది చెందింది. దానికి రచన, దర్శకత్వం వహించింది. పోలీసు అధికారి కంచన్ చౌదరి భట్టాచార్యకు ఆమె చెల్లెలు. కిరణ్ బేడీ తర్వాత రెండో ఐపీఎస్ అధికారి కాంచన్. కవిత మరో రెండు టెలివిజన్ షోలను నిర్మించింది - యువర్ హానర్ మరియు IPS డైరీస్. కవిత 1980లు మరియు 1990లలో ప్రసిద్ధ సర్ఫ్ యాడ్స్‌లో లలితాజీ పాత్ర పోషించినందుకు కూడా ప్రసిద్ది చెందింది.

Tags

Read MoreRead Less
Next Story