Rajamouli-Mahesh Movie Budget : రాజమౌళి, మహేశ్ సినిమా బడ్జెట్ వెయ్యి కోట్లు..! మైండ్ బ్లాక్ అప్ డేట్

రాజమౌళి - మహేశ్ సినిమా అప్ డేట్ కోసం జనాలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది.. ఎప్పడు మొదలవుతుంది.. ఎన్నేళ్లు షూటింగ్ చేసుకుంటుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. అన్న అంచనాలు పీక్స్ లో ఉంటున్నాయి. అలా సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.
కల్కి సినిమా బడ్జెట్ రూ.600కోట్లు. ఐతే.. రాజమౌళి- మహేష్ సినిమా బడ్జెట్ రూ.వెయ్యి కోట్లు ఉంటుందట. ఇది పూర్తి హాలీవుడ్ రేంజ్ మూవీగా తెరకెక్కే చాన్సుంది. వెయ్యి కోట్లు పెట్టి తీసి.. కనీసం 5,6 వేల కోట్లు వసూలు చేయాలనేది వారి ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. మహేష్ తో ఈసారి హాలీవుడ్ రేంజ్ సినిమాను చేయాలని చూస్తున్నాడు జక్కన్న.
ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఉండేలా నెక్స్ట్ లెవెల్ లో మూవీ షూట్, మేకింగ్ ఉంటుందట. ఈ ఇంటర్నేషనల్ సినిమా షూటింగ్, క్యాస్టింగ్, బడ్జెట్ డీటెయిల్స్ తో ప్రెస్ మీట్ పెట్టేందుకు టీమ్ రెడీ అయినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com