Indian 2 : ఇండియన్-2 పై ఆ 2 సినిమాల ఎఫెక్ట్?

Indian 2 : ఇండియన్-2 పై  ఆ 2 సినిమాల ఎఫెక్ట్?

శంకర్ దర్శకత్వంలో భాన్సీ' విడుదల కాబోతోంది. అదే రతీయుడు సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిస్తున్న మూవీ ఇండియన్ -2. విలక్షణ నటుడు కమలహాసన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమ వుతోంది. దర్శకుడు శంకర్ మరో వైపు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్నాడు. ఇండియన్ 2 జూన్ రెండో వారం అంటే 14వ తారీఖున విడుదల చేయాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నాడట. నిర్మాతలు కూడా ఆ దిశగా ప్రయ త్నాలు మొదలు పెట్టారు. సౌత్ లో ఇండియన్ 2 కి జూన్ నెలలో పెద్దగా ఆటంకాలు లేవు. హిందీ లోమాత్రం జూన్ 14న స్టార్ హీరోయిన్ నటిస్తు న్న మోస్ట్ అవైటెమ్ మూవీ 'ఎమర్జెన్సీ విడుదల కాబోతుంది.. అదే రోజున బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న చందు చాంపియన్ అనే సినిమా కూడా విడుదలవబోతోంది. ఎమర్జెన్సీ, చందు చాంపియన్ లను దాటి హిందీలో ఇండియన్ 2 బజ్ క్రియేట్ చేస్తుందా..? అన్నటాక్ మొదలైంది. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప హిందీ ప్రేక్షకులు ఇండియన్ 2 వైపు చూడక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దానికి తగ్గట్లుగా హిందీ మార్కెట్ లో పోటీ లేని సమయంలో విడుదల చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అన్నట్లుగా సినీ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

Tags

Read MoreRead Less
Next Story