Shubhalekha Sudhakar : నా కొడుకును సంతృప్తి పరచలేకపోతున్నా.. శుభలేఖ సుధాకర్ అంతరంగం

1980, 1990స్ లో శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సైడ్ హీరోగా చాలా ఫేమస్. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేశారు. చాలా సినిమాల్లో తన కామెడీతో, డైలాగ్ డిక్షన్ తో ఆకట్టుకున్నారు. ఐతే.. తన కొడుకును సంతృప్తి పరచడంలో మాత్రం ఆయన కొంత అసంతృప్తి వ్యక్తంచేశారు.
తన నటనతో తన కొడుకునే మెప్పించలేకపోతున్నాట్లు వెల్లడించారు శుభలేఖ సుధాకర్. మంచి బేస్ ఉన్న వాయిస్ ఉన్నప్పటికీ.. మంచి టైమింగ్ ఉన్నప్పటికీ... ఎప్పుడో ఒక అవకాశం తప్పితే తన వద్దకు ఎక్కువగా ఛాన్సులు రావట్లేదని తెలిపారు. అలాగే తనకు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రాకపోవడానికి గల కారణాలు కూడా తెలిపారు.
సూరావజ్జల సుధాకర్ మొదటి సినిమా శుభలేఖ కావడంతో.. ఆయన శుభలేఖ సుధాకర్ గా పాపులర్ అయ్యారు. సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించాడు సుధాకర్. కెరియర్ చక్కగా నడుస్తున్నప్పుడే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజను పెళ్లి చేసుకున్నాడు సుధాకర్. ఈ ఇద్దరికీ ఒక్క కొడుకు ఉన్నాడు. ఆయన పేరు శ్రీకర్. తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుని, విమర్శకులను మెప్పించిన సుధాకర్.. తన కొడుకును మాత్రం అంతగా సంతృప్తిపరచలేదని తెలిపారు.
ముస్లిం మత పెద్దగా ఇటీవలే మసూద సినిమాలో శుభలేఖ సుధాకర్ మెరిశారు. చాలారోజుల తర్వాత మంచి పాత్ర పడింది ఆయనకు. యాత్ర 2 సినిమాలోనూ ఓ మంచి పాత్ర వేశారు. ఎక్కువగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సినిమాల్లో శుభలేఖ సుధాకర్ కనిపిస్తుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com