Tollywood : హీరోయిన్ విషయంలో.. రాజమౌళినే ఫోర్స్ చేస్తున్న ప్రొడ్యూసర్

Tollywood : హీరోయిన్ విషయంలో.. రాజమౌళినే ఫోర్స్ చేస్తున్న ప్రొడ్యూసర్

రాజమౌళి - మహేశ్ బాబు సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనిపై అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ భారీ అడ్వెంచరస్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది.. క్యాస్టింగ్ ఎవరుంటారు..అనేదానిపై రోజూ చర్చ జరుగుతోంది. ఈలోపే.. There is a rumor about the heroine in this movie

రాజమౌళి హీరోయిన్ల విషయంలో చాలా లెక్కలు వేస్తారు. ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ సినిమాలో మహేష్ బాబు పక్కన హీరోయిన్ అంటే.. తేల్చేయం చిన్న విషయం కాదు. ఈ సినిమాలో ఇప్పటికే హాలీవుడ్ రేంజ్ లో ఆటాడుతున్న దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రాల్లో ఒకరిని తీసుకోవాలని భావిస్తున్నారట.

దీపికా ప్రెగ్నెంట్ కావడంతో.. ఇప్పుడు హీరోయిన్ రేసు మారింది. ఐతే.. దీనిపై తాను హీరోయిన్ గా తాను సూచించిన అమ్మాయిని పెట్టుకోవాలని ఓ బడా బాలీవుడ్ ప్రొడ్యూసర్ రాజమౌళిని కోరుతున్నారట. ఆయనే బోనీ కపూర్. తన కూతురు జాన్వీ కపూర్ ను మహేశ్ పక్కన హీరోయిన్ గా పెట్టుకోవాలని బోనీ కపూర్ రాజమౌళిని కోరుతున్నారట. సెకండ్ లీడ్ గా అయినా తీసుకోవాలని అంటున్నాడట. అందం, షేపులు ఉన్న జాన్వీ.. హైట్ విషయంలో సెట్ కాదన్నది కొందరి అభిప్రాయం. దిమ్మతిరిగే అందగత్తె దిశాపటాని మరో చాయిన్ గా ఉంది. చూడాలి.. రాజమౌళి లెక్కలు మామూలుగా ఉండవు. అన్ని భాషలు, బిజినెస్ ఈక్వేషన్లు సెట్ కావడానికి పాత్రలు పుట్టించి ఎంతమంది హీరోయిన్లనైనా పెట్టేయడంలో ఘనడు రాజమౌళి అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. పాత్ర కోసం జాన్వి కపూర్ సెలెక్ట్ అవుతుందో..? దిశా పటాని ఫైనలైజ్ అవుతుందో..? తెలియాలి అంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే..!

Tags

Read MoreRead Less
Next Story