Thriller Movie : థ్రిల్లర్ వచ్చేసింది.. ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ 'ఆట్టం'

మలయాళం సినిమాలంటేనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. ఆ సినిమాలకు ఓటీటీలో ఉండే క్రేజే వేరు. రోజంతా కూర్చుండబెట్టి స్మార్ట్ టీవీలు, ఫోన్ల ముందే కూర్చోబెట్టడంలో కేరళ థ్రిల్లర్లు సక్సెస్ అవుతూ వస్తున్నాయి. కొత్త కథతో, కథనాలతో మలయాళ మేకర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
రీసెంట్ గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మలయాళ థ్రిల్లర్ మూవీ ఆట్టం (Aattam). మలయాళ మేకర్స్ ఎక్కువగా ఫీల్ గుడ్ కథలతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తారు. కానీ 'ఆట్టం' అలా కాదు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఏ భాషలో అయినా ఈ జోనర్లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. సబ్ టైటిల్స్ తో అయినా సరే సస్పెన్స్ థ్రిల్లర్స్ పూర్తిగా అలరిస్తాయి. ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ఆట్టం' మూవీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
అమెజాన్ లో మలయాళ వెర్షన్ లో ఆట్టం రెడీగా ఉంది. థ్రిల్లర్లకు భాషతో సంబంధం లేదు కానీ.. కొన్ని డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంగ్లీష్, తెలుగు సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంచారు. ఈ మూవీని ఆనంద్ ఏకర్షి డైరెక్ట్ చేశాడు. వినయ్ ఫోర్ట్ ఇందులో హీరోగా నటించగా.. జరీన్ షిహాబ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో కళాభవన్ షాజాన్ ముఖ్య పాత్రలో కనిపించారు. వీరితో పాటు అజీ తిరువంకులం, జాలీ ఆంటనీ, మదన్ బాబు, నందన్ ఉన్నీ, ప్రశాంత్ మాధవన్, సనోష్ మురళి మరియు సెల్వరాజ్ రాఘవన్ వంటి తదితరులు కూడా ఈ సినిమాలో నటించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com