Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న మార్చి 29న రిలీజై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉండటంతో థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి.

ఏకంగా 27 కోట్లకు టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. కలెక్షన్స్ కూడా ఊహించని విధంగా భారీగానే వస్తున్నాయి. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. అమెరికాలో కూడా మొదటి రోజే 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది. స్టార్ బాయ్ సిద్ధూ రికార్డులు బద్దలు కొడుతున్నాడని పేర్కొంది.

కాగా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఈ మూవీ వచ్చింది. ఈ వీకెండ్ నేడు, రేపట్లో ఈజీగా 50 కోట్లు దాటేస్తుందని, ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాత నాగవంశీ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ఫస్ట్ డే 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావచొచ్చని అన్నారు. అలాగే లాంగ్ రన్‌లో 100 కోట్లు కొల్లగొడుతుందని చెప్పాడు. దీంతో.. టిల్లు ఎంత రాబడుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story