OTT Movies : టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్.. ఓటీటీలో హాట్ కేక్స్

OTT Movies : టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్.. ఓటీటీలో హాట్ కేక్స్
X

శుక్రవారం వచ్చేసింది. ఓటీటీ లవర్స్ కు కొత్త సినిమాల విందు పెట్టేసింది. ఫ్యామిలీ స్టార్ (2024) విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ-డ్రామా చిత్రం. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేదు.బాక్సాఫీస్ వద్ద ఓ డిజాస్టర్ గా నిలిచింది. థియేట్రికల్ రిలీజ్ అయిన కేవలం మూడు వారాల వ్యవధిలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చింది.

ఫ్యామిలీ స్టార్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. గీత గోవిందం (2018) బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్ దర్శకుడితో కలిసి చేసిన రెండవ చిత్రం ఇది. మరో బ్లాక్ బస్టర్ కూడా ఓటీటీకి వచ్చేసింది.

సిద్దు జొన్నల గడ్డ నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ (2024) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. DJ టిల్లు (2022)కి సీక్వెల్‌గా రూపొందించబడిన ఈ సినిమా.. అద్భుతమైన థియేట్రికల్ రన్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది టిల్లు స్క్వేర్.

Tags

Next Story