Tillu Square : 'టిల్లు స్క్వేర్'కు ఊరమాస్ డిమాండ్.. డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లు పలికిందో తెలుసా?

Tillu Square : టిల్లు స్క్వేర్కు ఊరమాస్ డిమాండ్.. డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లు పలికిందో తెలుసా?

ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా డీజే టిల్లు. సిధ్ధు కెరీర్‌ ను మార్చిన సినిమా ఇది. దీంతో సీక్వెల్ రెడీ చేసి రిలీజ్ కు రెడీ అయిపోయాడు.

టిల్లు స్క్వేర్ టైలర్ తో మేకర్స్ వేసిన మాస్టర్ ప్లాన్ బాగా వర్క్ అవుట్ అయింది. బిజినెస్ పరంగా భారీ క్రేజ్ వచ్చింది. చాలామందికి దిమ్మతిరిగేలా భారీ ధరకు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి.

ఈ సినిమా నాన్ దియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.35 కోట్లకు అమ్ముడుపోయాయట. సిద్దు జొన్నలగడ్డకు అంత మార్కెట్ లేకపోయినా టిల్లు మూవీ కి ఉన్న బ్రాండ్.. క్రేజ్ రీత్యా దీనికి బయ్యర్లు ఆ రేంజ్ లో కొనుగోలు చేసినట్లు సమాచారం. యూత్ లో మంచి పాపులారిటీ దక్కించుకున్న స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించడంతో సినిమాకు మరింత ఆకర్షణ. లిప్ లాక్ వెండితెరపై చూసేందుకు యూత్ ఇప్పటికే అడ్వాన్స్ గా రెడీ అయిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story