Tillu Square : టిల్లు స్క్వేర్ రిలీజ్.. బాక్సాఫీస్‌కు ఊపు..

Tillu Square : టిల్లు స్క్వేర్ రిలీజ్.. బాక్సాఫీస్‌కు ఊపు..

సంక్రాంతి తర్వాత ఈగిల్ ఒక్కటే సినిమా బాక్సాపీస్ దగ్గర సందడి చేసింది. చాలా సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. అలాంటి సీజన్ లో.. పరీక్షల ముగింపు సీజన్ లో సమ్మర్ ఎంటర్ టైనర్ గా వస్తోంది టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంట ఈసారి ఎంతగా అలరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

గత వారం 'ఓం బీమ్ బుష్‌'తో టాలీవుడ్ కు ఓ హిట్ దక్కింది. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర నిలబడగలిగింది. మార్చి 29న 'డీజే టిల్లు' సీక్వెల్ 'టిల్లు స్క్వేర్‌' వస్తోంది. ఫిబ్రవరిలో రావాల్సిన ఈ మూవీ.. కొంత గ్యాప్ తీసుకుంది. 'ఈగల్' సినిమాకు దారి ఇవ్వడం కోసం వాయిదా పడింది. ఇప్పుడు మంచి ముహూర్తం చూసుకొని, సోలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొంది.

'టిల్లు' అనూహ్యమైన విజయం సాధించడం, సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్ బాగా పట్టేయడం, తన డైలాగులు వైరల్ కావడంతో 'టిల్లు' పాత్ర ఓ మైల్ స్టోన్‌లా మారిపోయింది. అందుకే ఈ సీక్వెల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీక్వెల్ కి వచ్చేసరికి కొన్ని మార్పులు జరిగాయి. హీరోయిన్ మారిపోయింది. దర్శకుడు మారాడు. అయినా క్రేజ్ తగ్గలేదు. సరికదా, పెరిగింది. అనుపమ హాట్ లుక్స్‌, లిప్ లాక్స్‌.. యువతకు ఈ చిత్రాన్ని మరింత దగ్గర చేసింది. 'టిల్లు'లో టైటిల్ సాంగ్ సూపర్ హిట్టు. ఈ సినిమాలోనూ పాటలు బాగా రీచ్ అయ్యాయి. టీజర్‌, ట్రైలర్‌లో.. టిల్లు స్థాయి వినోదం కనిపించింది. దాంతో.. విడుదల రోజు థియేటర్లు హౌస్ ఫుల్స్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. డబ్బింగ్ సినిమా 'ఆడు జీవితం' (గోట్ లైఫ్‌) కాంపిటీషన్ గా వస్తోంది. ఫృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమా బాగుంటే టిల్లు స్క్వేర్ కు పోటీ ఇచ్చే చాన్సుంది. ఐనా.. పెద్దగా సినిమాలు లేవు కాబట్టి.. కంటెంట్ బాగుంటే వసూళ్లకైతే సమ్మర్ లో ఢోకా ఉండదు. మండే ఎండల్లో ఏసీలో కూర్చుని నవ్వుకుని పోవడానికైతే జనం సిద్ధమే.

Tags

Read MoreRead Less
Next Story