Rave Party Case : నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో సహా 8 మందిని సీబీఐ నేడు విచారించనుంది. ఈనెల 27న విచారణకు రావాలంటూ వారికి సీబీఐ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టై, జుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కాగా రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా, 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.
మరోవైపు ఈ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితుల్లో అయిదుగురి బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు లంకిపల్లి వాసు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. వారి ఖాతాలకు వచ్చిన నగదు వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.
ఈ కేసులో ఆధారాలతో తీగ లాగితే.. డొంక కదులుతోంది. రేవ్ పార్టీలో పొలిటికల్ లీడర్లు.. ప్రముఖులకు లింకులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏపీ మంత్రి కాకాని పేరుతో ఉణ్న స్టిక్కర్ ఉన్న కారు ఉండటంతో.. మంత్రి అనుచరుడు పూర్ణారెడ్డి బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేవ్ పార్టీ ఏర్పాటులో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని.. పోలీసులు ధృవీకరించారు. కాగా రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా, 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com