Today OTT Releases : ఈ రోజు ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు

Today OTT Releases : ఈ రోజు ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు

గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ‘గామి, ఓం బీమ్ బుష్, ప్రేమలు‘ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. మార్చిలో విడుదలైన ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. దీంతో.. ఈ సినిమాలను ఓటీటీ వేదికగా చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

మార్చి నెలలో విడుదలైన తెలుగు చిత్రాల్లో 'ఓం భీమ్ బుష్' ఒకటి. నాన్ స్టార్ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా.. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ ని కూడా యు.వి.క్రియేషన్స్ తీసుకొచ్చింది. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఆడియన్స్ కి నవ్వుల ట్రీట్ అందించింది. ప్రస్తుతం 'ఓం భీమ్ బుష్' చిత్రం.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

మరో సినిమా ‘ప్రేమలు‘ ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాడు. థియేట్రికల్ గా మంచి పేరు తెచ్చుకోవడంతో ‘ప్రేమలు‘ సినిమా కోసం ఓటీటీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

మార్చిలో మహాశివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో 'గామి' ఒకటి. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి యు.వి.క్రియేషన్స్ సమర్పకులుగా వ్యవహరించింది. ప్రచార చిత్రాలతో ఓ విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పరచుకున్న 'గామి'.. థియేటర్లలో ఆడియన్స్ కి సరికొత్త విజువల్ ట్రీట్ అందించింది. తక్కువ బడ్జెట్ లో క్రౌడ్ ఫండింగ్ తో పెద్ద కాన్వాస్ తో వచ్చిన 'గామి' విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇప్పటికే థియేటర్లలో హిట్టైన 'గామి' చిత్రం ప్రస్తుతం జీ5 వేదికగా స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story