Daksha Nagarkar : ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ దక్ష నగార్కర్

టాలీవుడ్ హీరోయిన్ దక్ష నగార్కర్.. ఆస్పత్రిలో చేరింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. 'గడిచిన కొద్ది రోజులు నాకెంతో క్లిష్టమైనవి.. ఎవరో తెలియని వ్యక్తుల మధ్య సర్జరీ గదిలో పడి ఉండటం కష్టంగా ఉంది. ఇప్పటికే వెన్నెముకకు రెండుసార్లు అనస్థీషియా ఇంజెక్షన్స్ ఇచ్చారు. దాన్నుంచి కోలుకోవడం కష్టంగా ఉంది. నా ఎమోషన్స్ను అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు అండగా నిలబడ్డారు. ప్రేమ, కేరింగ్ కు కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉంది. నా పరిస్థితి ఎవరికీ రాకూడదు అని రాసుకొచ్చింది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బాధపడకూడదని నా గురించిసంతోషకరమైన విషయాలనే పోస్ట్ చేస్తున్నానని తెలిపింది. అయితే తనకు ఏ సర్జరీ అయిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఇక దక్ష సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలపైనే అవుతున్నా.. కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేసింది. అవన్నీ టాలీవుడ్ సినిమాలు మాత్రమే కావడం గమనార్హం. హుషారు, జాంబి రెడ్డి, రావణాసుర, బంగార్రాజు సినిమాలో ఈ బ్యూటీ నటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com