Tollywood : కన్నడ నటుడు దర్శన్‌కు టాలీవుడ్ హీరో మద్దతు

అభిమానిని క్రూరంగా హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్‌కు ( Darshan ) టాలీవుడ్ హీరో నాగశౌర్య ( Naga Shaurya ) మద్దతు తెలిపారు. రేణుకాస్వామి మృతిపై విచారం వ్యక్తం చేస్తూనే.. దర్శన్ కలలో కూడా ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదన్నారు. ఈ విషయంలో ప్రజలు తొందరపాటుతో ఆయనను దోషిగా నిర్ధారిస్తుంటే బాధేస్తోందన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే నిజం బయటికి వస్తుందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ తూగుదీప అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 15 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
అసలు విషయంలోకి వెళ్తే.. హీరో దర్శన్ భార్య, పిల్లలు ఉండగానే.. ప్రముఖ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది.. దీంతో దర్శన్ వీరాభిమాని పవిత్ర గౌడ ను టార్గెట్ చేస్తూ దూషిస్తూ సోషల్ మీడియా ఖాతాలో నెగిటివ్ కామెంట్లు చేశారు.. దీంతో తట్టుకోలేకపోయిన ఈమె దర్శన్ ను ఒప్పించి రూ .30 లక్షలు సఫారీ ఇచ్చి రేణుక స్వామిని హత్య చేశారు. ఈ హత్య కేసుతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. దీంతో దర్శన్ దోషి అంటూ పోలీసులు అరెస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com