Tollywood : ఘనంగా టాలీవుడ్ హీరో పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే..?

Tollywood : ఘనంగా టాలీవుడ్ హీరో పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్, టాలెంటెడ్ హీరో తిరువీర్, తన స్నేహితురాలు కల్పన రావును పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇరు కుటుంబాలు కొందరు సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తన పెళ్లి ఫోటోలను తిరువూరు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ కొత్త ఆరంభం అంటూ లవ్ సింబల్ ను క్యాప్షన్ గా జోడించాడు.

హల్దీ వేడుకలతో పాటు పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. కుండలో ఉంగరం ఆట ఆడిన ఫోటోలు కూడా ఆయన షేర్ చేశాడు. నాటకాలతో కెరీర్ ప్రారంభించినతిరువీర్.. కొంతకాలం రేడియో జాకీగా పని చేశారు. 2016లో బొమ్మలరామారం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తర్వాత దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజి సినిమాలో కీలక పాత్రలో మెప్పించాడు.

ఏ మంత్రం వేసావే, శుభలేఖలు ఇలా పలు సినిమాల్లో కనిపించాడు తిరువీర్. జార్జి రెడ్డి సినిమాతో తిరువీర్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మల్లేశం, పలాస 1978 సినిమాల్లో మెప్పించాడు. నాని టక్ జగదీష్‌ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించాడు. హారర్ బ్లాక్ బస్టర్ మసూదా.. తిరువీర్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నాడు. కెరీర్ ఊపులో ఉన్న టైంలో పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన తిరువీర్ కు శుభాకాంక్షలు.

Tags

Read MoreRead Less
Next Story