Mamitha Baiju : ట్రెండింగ్ గాళ్ మమితా బైజు అనుకున్నది సాధించింది!
![Mamitha Baiju : ట్రెండింగ్ గాళ్ మమితా బైజు అనుకున్నది సాధించింది! Mamitha Baiju : ట్రెండింగ్ గాళ్ మమితా బైజు అనుకున్నది సాధించింది!](https://www.tv5news.in/h-upload/2024/05/09/1257469-mamitha-baiju.webp)
ట్రెండింగ్ హీరోయిన్లు ఎవరంటే శ్రీలీల.. మమిత బైజు గురించి చెబుతారు. ప్రేమలు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో ఇండస్ట్రీని షేక్ చేసి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేనా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి కంట్లో పడింది. ఆమె నటనకు రాజమౌళి శాతం ఫిదా అయ్యాడు ..అంటే అమ్మడులో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రేమలు సినిమా తర్వాత మమితా బైజు పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.ఆఫర్లు కూడా బాగానే పట్టేస్తున్నాయ్. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో మమితా బైజు జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసింది అంటూ ప్రచారం జరుగుతుంది.
విజయ్ దేవరకొండ కెరియర్ లో 12వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీలో మమిత బైజు హీరోయిన్గా సెలెక్ట్ అయిందట. కన్ఫర్మ్ అయిపోయిందట. రేపోమాపో అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటున్నారు సినీ ప్రముఖులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com