Trisha : సెకండ్ ఇన్నింగ్స్ లోనూ త్రిష సూపర్ ఫాం

Trisha : సెకండ్ ఇన్నింగ్స్ లోనూ త్రిష సూపర్ ఫాం

టాలీవుడ్ బ్యూటీ త్రిష సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల కాలంలో అటు కోలీవుడ్లో, ఇటు టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్నాళ్ల క్రితం వరుస పెట్టి సినిమాలు చేసిన త్రిష.. ఆ తరువాత కాస్త డీలా పడింది. అవకాశాలు అందక అయోమయానికి గురైంది. దీంతో సినిమాలకు పుల్ స్టాప్ పెడుతుందా అనే అనుమానం ఆమె అభిమానుల్లో కలిగింది.

కానీ త్రిష మరోసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తమిళంలో రెండు, మూడు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తూ.. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం సౌత్ లో సూపర్ ఫామ్ లో ఈ బ్యూటీ దూసుకెళ్తుంది. కోలీవుడ్ లో దాదాపు నయనతారకు ప్రత్యామ్నాయం గా మారింది. విశ్వంభర సినిమా హిట్ అయితే టాలీవుడ్ లోనూ ఫుల్ బిజీ కానుంది. ఇక సౌత్లో త్రిష మళ్లీ ఫామ్ లోకి రావడంపై ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story