Avantika : మనవాళ్లే ట్రోల్ చేస్తున్నారంటూ అవంతిక కామెంట్స్

Avantika : మనవాళ్లే ట్రోల్ చేస్తున్నారంటూ అవంతిక కామెంట్స్

తెలుగులో మెరిసి హాలీవుడ్ లో ఆకట్టుకున్న 19 ఏళ్ల పిల్ల అవంతిక వందనపు (Avantika Vandanapu). మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బ్యూటీ పేరు ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారింది. మనమంతా, ప్రేమమ్‌ సినిమాలు అవంతిక క్రేజ్‌ను పెంచాయి.

ప్రస్తుతం అవంతిక హీరోయిన్‌గా బిజీ లైఫ్ గడుపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా మీన్ గర్ల్స్ సినిమాలో అవంతిక నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో అవంతిక ఎక్స్ పోజింగ్ గురించి, ఆమె అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ గురించి తెగ ట్రోల్స్ జరుగుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో రీసెంట్ గా స్పందించింది.

అవంతిక అమ్మది హైదరాబాద్, నాన్నది నిజామాబాద్ దగ్గరున్న పిట్లం. అందుకే.. ఇటు తెలంగాణ స్లాంగ్.. అటు అమెరికన్ ఇంగ్లీష్ దంచికొడుతుంది అవంతిక. ఇండియా అమెరికా రెండూ తన దేశాలేనని చెబుతోంది. తాను అమెరికా ఆక్సెంట్‌లో మాట్లాడుతున్నానని నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. అంత దారుణంగా ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను అమెరికాలో పుట్టి పెరిగాను. కాబట్టి నా మాట, యాస అక్కడిలానే వస్తుంది. దానికి ట్రోల్స్ చేయడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటూ వివరించింది. ట్రోల్స్ మనం కంట్రోల్ చేయలేం.. అయితే ఇంత దారుణమైన ట్రోలింగ్ నేను ఇప్పటివరకు అసలు చూడలేదు అంటూ అవంతిక వివరించింది. అమెరికా లాంటి ప్లేసెస్ లో నెపోటిజం ఉండదు.. స్టార్స్ అయినా క్యారెక్టర్ సెలెక్షన్ ముందు ఆడిషన్స్ ఉంటాయని తెలిపింది. ఇంటర్వ్యూ విన్నాక ఇంత చిన్న వయసులోనే అవంతికకు ఉన్న సినిమా అవగాహన చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story