Dil Raju : నా పెళ్లిపై ట్రోల్స్ పట్టించుకోను: దిల్ రాజు

Dil Raju : నా పెళ్లిపై ట్రోల్స్ పట్టించుకోను: దిల్ రాజు

తన పెళ్లిపై వచ్చిన ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ పట్టించుకోనని నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘నా పెళ్లి తర్వాత ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ వీడియోపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ నా భార్య చూసి నాకు చెప్పింది. ఇలా ట్రోల్స్‌, నెగెటివ్ కామెంట్స్‌ చేసేవాళ్ల గురించి పట్టించుకుంటే నేను మిగతా వాళ్లకు దూరమవుతాను. అందుకే నేను అలాంటి వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించిచను. నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటే.. విమర్శించేవారు పది వేల మంది కూడా ఉండరు. నేను ఆకాశం లాంటి వాడిని.. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి.. ఆ తర్వాత ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

తన మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించడంతో 50 ఏళ్ళ వయసులో దిల్ రాజు మరో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండో పెళ్లి ప్రేమ వివాహం కావడం విశేషం. అంతేకాదు గత ఏడాది రెండో భార్య తేజస్వినితో ఓ బాబుకి కూడా జన్మానించారు. కాగా ఈ ప్రేమ పెళ్లి చేసుకోవడం పట్ల దిల్ రాజు పై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఆయన స్పందించారు.

మరోవైపు ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ విషయంలో టార్గెట్ రీచ్ అయ్యామని నిర్మాత దిల్ రాజు అన్నారు. మీడియా నుంచి రివ్యూస్ ఒకలా ఉన్నాయని.. కుటుంబ ప్రేక్షకుల నుంచి టాక్ వేరేలా ఉందన్నారు. వారిలో 90శాతం మందికి ఫ్యామిలీ స్టార్ మూవీ నచ్చిందని పేర్కొన్నారు. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని సినిమా తీసినట్లు చెప్పారు. కుటుంబాన్ని గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ స్టార్స్‌ని గుర్తించి కలవనున్నట్లు తెలిపారు. ఇక ‘ఫ్యామిలీ స్టార్‌’ తనకెంతో ప్రత్యేకమని దిల్ రాజు చెప్పారు. 21ఏళ్ల క్రితం ఇదే రోజున ‘దిల్‌’ సినిమా విడుదలై తనకు మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అదే తేదీలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రావడం ఆనందంగా ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story