Venkatesh : ఇద్దరు భామల ముద్దుల ప్రియుడిగా వెంకీ

Venkatesh : ఇద్దరు భామల ముద్దుల ప్రియుడిగా వెంకీ
X

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ను పూర్తి చేసేందుకు ముగ్గురూ మూడోసారి కలిసి పనిచేస్తున్నారు. ఎస్ వీసీ ప్రొడక్షన్ నెం. 58 సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

కొద్ది రోజుల క్రితం గ్రాండ్ లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ ప్రారంభమైయింది. ప్యాలెస్ జరుగుతున్న షూటింగ్ సినిమా మెయిన్ కాస్ట్ పాల్గొంటున్నారు. మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియో వర్కింగ్ వెదర్ ను చూపిస్తోంది. భర్త, భార్య, గర్ల్ ఫ్రెండ్.. మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్ ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్ టైనర్ అని మేకర్స్ తెలిపారు.

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Tags

Next Story