Game Changer : గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్.. సాంగ్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు మేకర్స్ మూవీ నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ తాజా పోస్టర్ లో బ్లూ డ్రెస్ లో అదిరిపోయే చరణ్ ఫ్రంట్ లుక్ రివీల్ చేశారు. రేపు ఉదయం 9 గంటలకు సాంగ్ విడుదలవుతుందని ప్రకటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నిజానికి గతేడాది దీపావళికే వస్తుందనుకున్న ఈ పాట ఇప్పుడు చరణ్ బర్త్ డే నాడు అభిమానులను అలరించడానికి వస్తోంది.
రామ్ చరణ్, కియారా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.110 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ తమ ఓటీటీలోనే రాబోతోందని ప్రైమ్ వీడియోనే ఈ మధ్య జరిగిన ఓ ఈవెంట్లో వెల్లడించిన విషయం తెలిసిందే.
'గేమ్ ఛేంజర్' మూవీని దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ..గేమ్ ఛేంజర్ మూవీ కంప్లీట్ చేస్తూనే.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. మరోవైపు రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో 17వ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com