Uppena Remake : బాలీవుడ్‌లో ఉప్పెన రీమేక్.. హీరోయిన్ ఎవరంటే?

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా యువతను ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. వందకోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాతో కృతిశెట్టి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. కాగా ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు నిర్మాత బోనీ కపూర్ తెలిపారు.
ఈ సినిమా ఆయనకు తెగ నచ్చేసిందట. తన రెండో కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్‌గా సినిమాను పునర్నిర్మించాలని చూస్తున్నారట. రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన బోనీ కపూర్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు. అయితే ఖుషీ కపూర్ సరసన ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్‌లో ఖుషీ కపూర్ ఇప్పటికే రెండు క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ కుమారుల సినిమాల్లో ఖుషీ నటించనున్నట్లు సమాచారం. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘నాదనియాన్’ సినిమాలో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘లవ్‌టుడే’ సినిమా హిందీ రీమేక్‌లో ఆమిర్‌ఖాన్ కుమారుడు జువైద్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం హీరోయిన్‌గా ఖుషీని సంప్రదించినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com