Urvashi Rautela : రవితేజతో ఊర్వశి రౌతేలా! ఈసారి మరింత హాట్ గా..!

మాజీ మిస్ ఇండియాగా అందాల వల వేసి హీరోయిన్ గా రాణిస్తున్న అమ్మడు ఊర్వశి రౌతేలా ( Urvashi Rautela ). 'వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద' సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ మెరిసింది ఈ బాలీవుడ్ భామ. ఈ భామ తొలిసారి టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఎన్బీకే 109లో తొలిసారి ఫీ మేల్ లీడ్ రోల్ లో కూడా నటిస్తోంది.
బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఊర్వశి రౌటేలా తెలుగులో మరో సినిమాకు సంతకం చేసిందన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ భామ కొత్త ప్రాజెక్ట్ బాబీ డైరెక్షన్లోనే చేయబోతుందన్న వార్త ఒకటి నెట్టింట షికారు చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ ప్రజల మనిషి టైటిల్తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు సైన్ చేశాడని ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ హై ఓల్టేజ్ ఎంటర్టైనర్ లో ఇద్దరు హీరోయిన్లు ఉండనుండగా.. ఊర్వశి రౌటేలా వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించబోతుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇక మరో భామ డింపుల్ హయతి కూడా రవితేజ పక్కన మరోసారి మెరవనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com