Urvashi : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఊర్వశి సందడి

Urvashi : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఊర్వశి సందడి

ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్కు హాజరై సందడి చేస్తున్నారు. భారత్ నుంచి కూడా పలువురు స్టార్స్ కూడా రెడ్ కార్పెట్పై తళుక్కున మెరిశారు. అలా మెరిసిన వాళ్లలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా ఉంది.

ట్యునీషియా డిజైనర్ సాహిర్ ఎల్ గబ్సీ రూపొందించిన కస్టమ్ గౌనులో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై ఊర్వశి క్యాట్ వాక్ చేసింది. ఆ వీడియోను, ఫొటోలను ఊర్వశి అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ఊర్వశికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఐటమ్ సాంగ్స్ చేస్తూ.. యువతను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్లో వాల్తేరు వీరయ్య, స్కంద, ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించి అలరించింది ఈ బ్యూటీ.

Tags

Read MoreRead Less
Next Story