Vaishnavi Chaitanya : అతనంటే ఎంతో క్రష్: వైష్ణవి చైతన్య

బేబీ సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది వైష్ణవి చైతన్య. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో అదరగొట్టింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుసగా రెండు పెద్ద బ్యానర్లలో అవకాశాలు అందుకుంది. ఇక దిల్ రాజు బ్యానర్ లో ఆశిష్ హీరోగా తెరకెక్కిన లవ్ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ లవ్ మీ (ఇఫ్ యు డేర్) అనే సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన గురించిన ఆసక్తికర విషయాలను వైష్ణవి చైతన్య వెల్లడించింది. అల్లు అర్జున్ తో హీరోయిన్గా నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చింది. తన అభిమాన హీరో రామ్ పోతినేని అని.. చిన్నప్పటి నుంచి తనంటే ఎంతో క్రష్ అని తెలిపింది. ప్రస్తుతం వైష్ణవి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డకి జోడీగా జాక్ అనే మూవీలో నటిస్తోంది. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com