Varun Tej : అందుకే సాయిపల్లివితో మళ్లీ సినిమా చేయలేదు: వరుణ్ తేజ్

ఇండస్ట్రీలో బెస్ట్ కాంబోలు కొన్ని ఉంటాయి.. అందులో వరుణ్ తేజ్ (Varun Tej), సాయిపల్లవి (Sai Pallavi) ఒకటి. వీరిద్దరూ కలిసి ఫిదా సినిమాలో కలసి నటించారు. ఇందులో ఎన్‌ఆర్‌ఐగా వరుణ్, తెలంగాణ అమ్మాయిగా పల్లవి కనిపించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడం, ఈ జోడికి మంచి పేరు రావడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తే బాగుండని చాలామంది అనుకున్నారు. అయితే ఫిదా తరువాత తామిద్దరం మళ్లీ కలిసి నటించరకపోవడం పట్ల వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
‘‘మా కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. ఆ మేరకు ఇద్దరం కథ విన్నాం. కానీ, ఈసారి చేస్తే ‘ఫిదా’ను మించి ఉండాలని, లేదంటే చేయకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే మళ్లీ కలిసి నటించలేకపోయాం’’ అని తెలిపాడు. కాగా ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తు్న్నాడు.
ఈ చిత్రం మార్చి 1న రిలీజ్ కానుంది. శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్.. ఇండియన్ ఎయిర్ పైలట్‌గా నటించగా అతనికి జోడీగా మానుషి చిల్లర్ నటించింది. రూ.50 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సోనీ పిక్చర్స్ ఇండియా, సిద్ధు ముద్దా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com