Venkatesh : వెంకటేశ్ కూతురి పెళ్లి.. ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) రెండో కూతురు హయవాహిని వివాహం నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని (Hyderabad) రామానాయుడు స్టూడియోలో ఈ వేడుక జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు నిషాంత్‌తో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరోల ఇంట పెళ్లి అంటే హాడావిడి మాములుగా ఉండదు.. కానీ వెంకటేష్ ఎందుకు సింపుల్ గా చేశారో అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.. ఇక వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉండగా పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. ఇప్పుడు రెండో కూతురు పెళ్లి జరిగింది. ఇక ఇటీవల సైందవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు వెంకటేష్ .. అయితే ఆ సినిమా హిట్ టాక్ ను అందుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com