Kajal Agarwal : సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీతో చందమామ

Kajal Agarwal : సంక్రాంతికి వస్తున్నాం..  వెంకీతో చందమామ

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ.. వరుస సినిమాలతో దూసుకెళ్తాంది. టాప్ హీరోలతో చాన్స్ అందుకుంటూ.. అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ అమ్మడు.. వెంకటేశ్ సినిమాలోనూ ఓ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఆయన హీరోగా అనిల్ రావిపూడి డెరెక్షన్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందులో ఒక హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపికైంది.

అయితే మరో హీరోయిన్ పాత్ర కూడా ఇందులో ఉందట. ఆ పాత్ర కోసం సెర్చ్ చేస్తున్న మూవీ టీం.. వెంకీ సరసన నటించేందుకు కాజల్ ను సంప్రదించిందట. కాజల్ కూడా అందుకు పాజిటివ్ గానే ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా గనుక ఖారారైతే.. వెంకటేశ్, కాజల్ కలిసి నటించే ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది.

ఇక టైటిల్ ను బట్టి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'ఇండియన్ 2' లో కమల్ హాసన్ సరసన కాజల్ నటిస్తోంది. అలాగే 'సత్యభామ' అనే లేడీ ఓరియేంటెడ్ సినిమా కూడా చేస్తోంది. ఈనెలలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ లో 'ఉమా' అనే మరో సినిమా కూడా చేస్తుంది.

Tags

Next Story