జయప్రదకు ఝలక్.. అరెస్ట్ చేయాల్సిందేనన్న రాంపూర్ కోర్టు

సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు రాంపూర్ ట్రయల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జయప్రదను మార్చి 6వ తేదీ లోపు అరెస్ట్ చేయాలంటూ రామ్‌పుర్ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లఘించిన కేసులో ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్‌పుర్ కోర్టు విచారిస్తోంది.
జయప్రదకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తనపై జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను నిలిపివేయాలంటూ జయప్రద అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో.. జయప్రదకు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. 2019 నుంచే ఈ కేసులో విచారణ జరుగుతోంది. అప్పట్నుంచే కోర్టు విచారణకు రావాలని జయప్రదకు ఆదేశిస్తోంది. కానీ. ఆమె కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. కోర్టుకు గైర్హాజరు అవుతూనే వస్తోంది. దాంతో.. కోర్టు జయప్రద పరారీలో ఉన్నట్లు గతంలో ప్రకటించింది.
దీంతో.. నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను కూడా జారీ చేసింది. ఈ వారెంట్‌ను సవాల్ చేస్తూ అలహాబాద్ కోర్టును ఆశ్రయించింది నటి జయప్రద. అయితే.. తాజా హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com