Vidya Balan : సినిమా సక్సెస్ కావాలని 42 రోజులు ఒకే షర్ట్ ధరించాడు : విద్యాబాలన్

తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న వింత సంఘటనలను బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా జాతకం బాగా లేదని, దురదృష్టవంతురాలినని చెప్పి ఓ నిర్మాత నన్ను సినిమా నుంచి తొలగించారంది. ఆ నిర్మాత నన్ను బాధపెట్టేలా మాట్లాడారు. తన జాతకం తన వద్ద ఉందని, నేనొక దురదృష్టవంతురాలినని అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నానని ఆయన మీడియాతో చెప్పారని తెలిపారు.
ఓ మూఢవిశ్వాసాలున్న డైరెక్టర్ తన మూవీ విజయం సాధించాలని 42 రోజులు ఒకే షర్ట్ ధరించాడు. చివరికి ఆ చిత్రం పరాజయం పాలైంది. వారి వివరాలు, సినిమా పేరు చెప్పాలనుకోవట్లేదు అని పేర్కొన్నారు. తన చిత్రానికి మంచి ఆదరణ రావాలనే ఉద్దేశంతో అతడు వింతగా ప్రవర్తించాడన్నారు. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి వ్యక్తులను ఎంతోమందిని చూశానన్నారు.
విద్యాబాలన్, ప్రతిక్ గాంధీ, ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా గత కొన్నిరోజుల నుంచి విద్యాబాలన్ వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com