Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. క్రేజీ కాంబినేషన్

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. క్రేజీ కాంబినేషన్
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్లో కొత్త సినిమా మొదలైంది. హిట్టు కోసం ఎదురుచూస్తున్న విజయ్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ లాంటిది. మంచి బ్యానర్ లో.. పాజిటివ్ వైబ్స్ తో షూటింగ్ ప్రారంభం కానుంది.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు.

'రాజా వారు రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ చిత్రమిది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది. విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను ప్రకటించారు. ఆల్ ది బెస్ట్ విజయ్.

Tags

Next Story