Vijay Deverakonda : విజయ్ దేవరకొండ డ్యుయల్ రోల్!

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ డ్యుయల్ రోల్!
X

విజయ్ దేవరకొండ హీరోగా, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్ ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. గతంలో విజయ్ తో టాక్సీవాలా మూవీ డైరక్ట్ చేసిన రాహుల్.. ఇప్పుడు పీరియాడికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. విజయ్ 14వ సినిమాగా ఇది రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్.. ఆడియెన్స్ తో పాటు అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది.

అయితే ఈ సినిమాపై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్, నాని కాంబినేషన్లో వచ్చిన శ్యామ్ సింగరాయ్ తరహాలోనే.. ఈ సినిమాలోనూ డ్యుయల్ రోల్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇది 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగే కథ అని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. టాలీవుడ్ తో పాటు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక, రీసెంట్ గా రిలీజైన ఫ్యామిలీ స్టార్ మూవీ అనుకున్నంత హిట్ తెచ్చిపెట్టలేదు. దీంతో తరువాత సినిమాలను చాలా ఫర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు విజయ్.

Tags

Next Story