Vijayashanti : చాన్నాళ్లకు పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి

స్టార్ హీరోలకు ధీటుగా ఒకప్పుడు మార్కెట్ సొంతం చేసుకున్న నటి విజయశాంతి ( Vijayashanti ). ఆమె కెరీర్లో అనేక విజయవంతమైన చిత్రాలున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది 'కర్తవ్యం'. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా విజృంభించింది. చాలా గ్యాప్ తర్వాత మల్లీ ఆమె పోలీస్ పాత్ర చేస్తున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రంలో 'కర్తవ్యం ' తరహాలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. ప్రదీప్ చిలుకూరి రచన, దర్శక త్వం వహిస్తున్న ఈ చిత్రా న్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఆమె పాత్రను వైజయంతి ఐపీఎస్ గా పరిచయం చేశారు. ఆమె ఖాకీ దుస్తుల్లో డాషింగ్ కనిపించారు. ఇంకా క్యారెక్టర్ని పరిచయం చేస్తూ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
వైజయంతి ఐపీఎస్.. తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫాంకే పౌరుషం వస్తుంది.... తానే ఒక యుద్ధం.... తానే తన సైన్యం.... అంటూ వాయిస్ ఓవర్తో పాత్రని పరిచయం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com