Thangalaan Movie : తంగలాన్ వస్తోంది.. విక్రమ్ హిట్ కొడతాడా?

హీరో విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా "తంగలాన్". పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. 'తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
"తంగలాన్" సినిమా త్వరలోనే విడుదల చేయనున్నారు. బుధవారం "తంగలాన్" ట్రైలర్ విడుదల చేశారు. “తంగలాన్” సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే బ్రిటీష్ పాలనా కాలంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం కోసం వేట మొదలుపెడతారు బ్రిటీష్ అధికారులు, విక్రమ్ బ్లాక్ పాంథర్ తో చేసిన ఫైట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చరిత్రలోని వాస్తవ ఘట్టాలను దర్శకుడు పా రంజిత్ తన సినిమాటిక్ యూనివర్స్లో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు " తంగలాన్" ట్రైలర్ తో తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com