Vishwak Sen : రెంచ్‌లు పట్టుకున్న విశ్వక్.. ఇక మెకానిక్ అవతారం

'గామి'గా దర్శనమిచ్చాడు విశ్వక్‌సేన్. తన కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు, విమర్శకుల మెచ్చుకోళ్లూ దక్కాయి. తను నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు మరో అవతారంలోకి మారిపోయాడు. 'మెకానిక్ రాకీ'గా రెంచులు పట్టుకొన్నాడు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.
రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ ఓ సినిమా చేస్తున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాత. దీనికి 'మెకానిక్ రాకీ' అనే పేరు పెట్టారు. ఈ రోజు విశ్వక్‌సేన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా వదిలారు. ఫస్ట్ లుక్ లో.. చేతిలో రెంచులు పట్టుకొని, మాస్ అవతార్‌లో దర్శనమిచ్చాడు విశ్వక్. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. కామెడీ, యాక్షన్ అంశాల్ని మేళవించిన కథ ఇది.
విశ్వక్‌కు పదో సినిమా. కాబట్టి.. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కొంత మేర షూటింగ్ జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com