Salman Khan : నాతో ఎప్పుడు వర్క్ చేస్తారు : లపాటా లేడీస్'పై సల్మాన్ పోస్ట్

కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ' లపాటా లేడీస్'ని సమీక్షించిన తాజా ప్రముఖులలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయన, మార్చి 13న కిరణ్‌పై ప్రశంసాపూర్వక పోస్ట్ చేసిన తర్వాత, దర్శకురాలిగా ఆమె 'అరంగేట్రం' అని తప్పుగా రాసి.. ఆ తర్వాత దాన్ని తొలగించారు. సూపర్ స్టార్ ఈసారి తన అరంగేట్రం గురించి ఏమీ ప్రస్తావించకుండా కొత్త పోస్ట్‌ను పంచుకున్నారు.
కొత్త నోట్‌లో , సల్మాన్, "కిరణ్‌రావు లాపాటా లేడీస్‌ని ఇప్పుడే చూశాను. వాహ్ కిరణ్. నేను నిజంగా ఆనందించాను. గ్రేట్ వర్క్. మీరు నాతో ఎప్పుడు వర్క్ చేస్తారు?" అని రాశాడు. అంతకుముందు సల్మాన్ ఖాన్ పోస్ట్ లో, "కిరణ్ రావు లాపాటా లేడీస్ ఇప్పుడే చూశాను. వాహ్ కిరణ్. నేను నిజంగా ఆనందించాను. దర్శకుడిగా మీ అరంగేట్రానికి అభినందనలు. గ్రేట్ వర్క్. మీరు నాతో ఎప్పుడు వర్క్ చేస్తారు?" అని రాశాడు.
కిరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన కామెంట్ పంచుకోవడం ద్వారా సల్మాన్ ప్రశంసల పోస్ట్‌కు సమాధానం ఇచ్చారు. ఆమె, " మీ డేట్స్ నాకు ఇవ్వండి, నేను సిద్ధంగా ఉన్నాను" అని రాసింది. ఆమె తదుపరి కామెంట్ లో, "చాలా ధన్యవాదాలు, మొత్తం టీమ్‌కి" అని రాసింది.
' లపారా లేడీస్' రైలు ప్రయాణంలో విడిపోయిన ఇద్దరు యువ వధువుల జీవితాన్ని వివరిస్తుంది. పోలీస్ ఆఫీసర్ మనోహర్ (రవి కిషన్ పాత్ర) మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తాడు. కిండ్లింగ్ ప్రొడక్షన్స్‌తో కలిసి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. జియో స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి బిపాల్బ్ గోస్వామి, స్నేహ దేశాయ్, దివ్యనిధి శర్మ స్క్రిప్ట్ అందించారు. మార్చి 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంది.

© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com