Gaami OTT Release : ఓటీటీలోకి వచ్చేస్తున్న గామి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Gaami OTT Release : ఓటీటీలోకి వచ్చేస్తున్న గామి..  స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ సినిమా ‘గామి’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఏప్రిల్ 12న జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా 'గామి' అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.

విశ్వక్ సేన్ సహా తెలుగమ్మాయి చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ 'గామి' సినిమాలో ప్రధాన తారాగణం. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీత దర్శకుడు, విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.

గామి మూవీ తొలి మూడు రోజుల్లోనే రూ.20 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించినా.. తర్వాత క్రమంగా తగ్గుతూ వెళ్లాయి. ఈ సినిమాకు గోపీచంద్ భీమా నుంచి కూడా పోటీ ఎదురైంది. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై కొంత మేర కనిపించింది.

Tags

Read MoreRead Less
Next Story