MAA Elections: ప్రకాష్ రాజ్‌కి అండగా ఉన్న ఆ పెద్దలెవరు?

పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి వెండితెరపై విలక్షణ నటుడిగా ఎదిగిన ప్రకాష్ రాజ్‌కి అభిమానులు చాలా మందే ఉంటారు. కన్నడ వాసి అయినా తెలుగు నాట నటించి అలనాటి దిగ్గజ నటుల సరసన తన పేరును నిలుపుకున్నారు. తెరపై అతడి హావ భావాలు, డైలాగ్ డెలివరీ ఔరా అనిపిస్తాయి. ఇండస్ట్రీలోకి వచ్చి మూడు దశాబ్దాలు గడిచినా అతడికి అవకాశాలు సన్నగిల్లలేదు. తన నటనకు గాను జాతీయ పురస్కారాలను, నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు 'మా' ఎలక్షన్లలో అధ్యక్షుడిగా పోటీ చేస్తుండడంతో అందరి ఫోకస్ ఆయనపై పడింది.
తనని నాన్ లోకల్ అంటున్న విమర్శకులకు తనదైన శైలిలో దీటైన సమాధానం చెప్పే మళ్లీ మాట్లాడే అవకాశం లేకుండా చేశారు ప్రకాష్ రాజ్. ఆయన ఎంచుకున్న ప్యానల్ సభ్యులు కూడా అటు బుల్లి తెర నుంచి, ఇటు వెండి తెర నుంచి ఉన్నారు. ముఖ్యంగా తనకు సరి జోడి అయిన సహజ నటి జయసుధ ఉండడం అతడికి కలిసి వచ్చిన మరో అంశం. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం ప్రకాష్ రాజ్‌కు అలవాటు. ఇండస్ట్రీలో తనకు ఎవరూ స్నేహితులూ లేరు, అలా అని శత్రువులూ లేరు అని చెప్పుకునే ప్రకాష్ రాజ్ ఈ ఎలక్షన్స్‌లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళతారో చూడాలి.
తెలుగు సినిమాని విశ్వవ్యాప్తం చేసి ప్యాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్న డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో 'మా'కి ఇంతవరకు భవనం లేకపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. త్వరలో జరగబోయే 'మా' ఎన్నికల్లో గెలిచే వారైనా కొత్త భవనం కలని ఎంతవరకు నిజం చేస్తారో చూడాలి.
Also Read :
♦ 'అంతేగా అంతేగా'.. ఈ నటుడు ఒకప్పుడు మంచి రొమాంటిక్ హీరో అని మీకు తెలుసా?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com