Pushpa 2 : పుష్ప-2లో ఐటమ్ గాళ్ ఎవరు..?

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2పై దేశవ్యాప్తంగా ఓ బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీలోనూ ఊ అంటావా లాంటి ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఇందులో ఎవర్ని తీసుకోవాలా? అని సుకుమార్ ఏకంగా మూడు నెలలుగా ఆలోచిస్తూనే ఉన్నాడు.
సుకుమార్ స్థాయికి, పుష్ష 2కి ఉన్న క్రేజ్‌కి దేశంలో ఏ కథానాయిక అయినా సరే… స్పెషల్ ఎప్పీరియన్స్‌లో కనిపించడానికి ముందుకు వస్తుంది. కానీ అలాంటిలాంటి కథానాయికని తీసుకొస్తే కిక్ ఏముంది? 'పుష్ష' లో సమంత సర్‌ప్రైజ్ చేసినట్టు ఇప్పుడూ ఏదో ఓ మ్యాజిక్ జరగాలి. ఐటెమ్ పాట జోలికి ఇప్పటివరకు వెళ్లని కథానాయికని తీసుకురావాలి. అనుకుంటున్నారట.
సమంత చేసిన స్టన్నింగ్ పెర్ఫామెన్స్, ట్యూన్ కు యూట్యూబ్ షేక్ అయిపోయింది. మరోసారి అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయాలని సుకుమార్ ట్రై చేస్తున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com