JR NTR : ఎన్టీఆర్ ఆ ఒక్కడినే ఎందుకు ఫాలో అవుతున్నాడంటే?

JR NTR : ఎన్టీఆర్ ఆ ఒక్కడినే ఎందుకు ఫాలో అవుతున్నాడంటే?

భారతీయ సినిమా కుంభస్థలాన్ని బద్దలు కొట్టే బాధ్యత అందుకున్నాడు యంగ్ టైగర్ తారక్. తెలుగు తెరపై తిరుగులేని నటుడుగా యంగ్ టైగర్‌గా క్రేజ్ సంపాదించుకున్న తారక్.. పాత్ర ఏదైనా దానికి ప్రాణం పెట్టి జీవించేస్తాడు. తాత నుంచి నటవరసత్వాన్ని పునికి పుచ్చుకున్న తారక్.. లక్షలాదిమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు.

అయితే తాజాగా పుట్టినరోజు వేడుకలు అభిమానులు గ్రాండ్ లెవెల్‌లో జరుపుకున్నారు. రక్తదానాలు, అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియాలో అయితే పోస్టులు మారి మోగిపోయాయి. చరణ్, బన్నీ లాంటి స్టార్ హీరోస్ తారక్‌ బర్త్ డే విషెస్ తెలియజేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ప్రస్తుతం దేవర సినిమాలోని ఫియర్ సాంగ్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ గా చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇన్‌స్టాలో 7.4 మిలియన్ మంది బుడ్డోడిని ఫాలో అవుతూ ఉంటారు. ఐతే.. ఎన్టీఆర్ మాత్రం ఎవరినీ ఫాలో కావడం లేదు. ఫేస్ బుక్ లో కూడా తారక్ రెండు ఖాతాలను మాత్రమే అనుసరిస్తున్నాడు. ఆ ఖాతాల్లో ఒకటి దర్శక ధీరుడు రాజమౌళి. మరొకటి ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్. తారక్ ను హీరోగా నిలబెట్టింది.. స్టార్ ను చేసింది.. ఇంటర్నేషనల్ రేంజ్ అందించింది రాజమౌళే కావడంతో.. ఆయన్ను మాత్రమే తారక్ ఫాలో అవుతున్నారని అభిమానులు చెబుతున్నారు.

Tags

Next Story