Kamal Haasan : కమల్ బయోపిక్ డైరెక్ట్ చేస్తారా?.. శ్రుతిహాసన్ ఆన్సర్ ఇదే

Kamal Haasan : కమల్ బయోపిక్ డైరెక్ట్ చేస్తారా?.. శ్రుతిహాసన్ ఆన్సర్ ఇదే
X

హీరోయిన్‌గానే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్స్‌ని సైతం రూపొందిస్తూ మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నారు శ్రుతిహాసన్ ( Shruthi Haasan ). తన తండ్రి కమల్ హాసన్ ( ( Kamal Haasan ) బయోపిక్‌ను డైరెక్ట్ చేయడంపై తాజాగా ఆమె స్పందించారు. ఆయన జీవిత చరిత్రను తీయడానికి తాను సరైన వ్యక్తి కాదని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో గొప్ప దర్శకులున్నారని.. వారైతే అద్భుతంగా తెరకెక్కించగలరని చెప్పారు. తాను తీస్తే ఒక వైపు నుంచి పక్షపాతంగా తీసినట్లు అనిపిస్తుందన్నారు.

సినిమాల విషయానికొస్తే.. గతేడాది ఐదు చిత్రాలతో వినోదాన్ని పంచిన శ్రుతి హాసన్‌ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ‘సలార్’కు కొనసాగింపుగా రానున్న ‘సలార్‌ శౌర్యంగపర్వం’లో కనిపించనున్నారు. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. అడివిశేష్‌ హీరోగా రానున్న ‘డకాయిట్‌’లో ఆమె నటిస్తున్నారు. ‘చెన్నై స్టోరీ’లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

Tags

Next Story