Nayanthara : వావ్.. యశ్ పక్కన నయనతార

Nayanthara : వావ్.. యశ్ పక్కన నయనతార
X

సన్నబడ్డ నయనతార.. తన కొత్త ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. 'కేజీఎఫ్`తో యశ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' తరవాత యశ్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడా? అని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అనడంతో.. ఇండస్ట్రీ అంతా బజ్ క్రియేట్ అయింది.

గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో నటించడానికి యశ్ ఒప్పుకొన్నాడు. ఈ సినిమా కోసం 'టాక్సిక్‌' అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం కథానాయిక ఎంపికపై చిత్రబృందం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఆ వ్యవహారం కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కథానాయికగా నయనతార దాదాపుగా ఫిక్స్ అయినట్టే. మొదట్లో కైరా అద్వాణీ, శ్రుతిహాసన్ లాంటి పేర్లు వినిపించాయి. అయితే నయనతార ఇప్పుడు రేసులోకి వచ్చింది. యశ్‌తో నటించడం నయనకు ఇదే తొలిసారి.

సుదీర్ఘ విరామం తరవాత నయన ఒప్పుకొన్న కన్నడ సినిమా ఇది. ఇది వరకు ఉపేంద్రతో సూపర్‌ అనే సినిమా చేసింది. ఆ తరవాత… 'టాక్సిక్‌'కు ఓకే చెప్పింది. ఓ కీలకమైన పాత్రలో కరీనాకపూర్ కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సివుంది.

Tags

Next Story