Yami Gautham : నకిలీ అవార్డులపై నమ్మకం లేదు: యామీ గౌతమ్

నకిలీ సినిమా అవార్డులపై తనకు నమ్మకం లేదని బాలీవుడ్ నటి యామీ గౌతమ్ వ్యాఖ్యానించారు. అందుకే కొన్నేళ్లుగా ఎలాంటి అవార్డు షోలకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. ఆస్కార్ అందుకున్న ఓపెన్ హైమర్ హీరో సిలియన్ మర్ఫీ నటన అద్భుతమని ఆమె ప్రశంసలు కురిపించారు.
‘గ్లోబల్ వేదికపై మీరు ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం అన్నిటికన్నా ప్రతిభే గొప్పదని చాటుతోంది’ అంటూ మర్ఫీని ఆమె ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా యామీకి 2022లో ప్రముఖ అవార్డ్ తనకు దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. తాజాగా 96వ అకాడమీ అవార్డ్ వేడుకల్లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ హవా అవార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్ విభాగంలో అవార్డ్ దక్కింది.
ఓపెన్ హైమర్ హీరో సిలియన్ మర్ఫీ అవార్డ్‌ను కైవసం చేసుకున్నారు. కాగా.. యామీ గౌతమ్ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ ఆమెకు ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో యామితో పాటు ప్రియమణి, అరుణ్ గోవిల్ కూడా నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com