Maharashtra : చిన్న నిర్లక్ష్యం.. 13 మంది బలి

X
By - /TV5 Digital Team |20 Aug 2021 3:38 PM IST
మహారాష్ట్రలో జాతీయ రహదారి నెత్తురోడింది. ఓ చిన్న నిర్లక్ష్యం.. 13 మందిని బలి తీసుకుంది. బుల్థానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో జాతీయ రహదారి నెత్తురోడింది. ఓ చిన్న నిర్లక్ష్యం.. 13 మందిని బలి తీసుకుంది. బుల్థానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై టిప్పర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కాసేపట్లో తమ గమ్యానికి చేరుకుంటామనగా జరిగిన ఈ ప్రమాదంలో టిప్పర్‌పై ఉన్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వీరంతా రోజువారీ కూలీలుగా భావిస్తున్నారు. ఘటనాస్థలం బంధువుల రోదనలతో హృదయవిదారకంగా మారింది. పోలీసులు సహాయక చర్యలు అందిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com